
బిజినెస్

ఏపీలో 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం నిర్మిస్తున్న ఓ ఘాట్‌కు సీఎం చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ పేరు పెట్టడంపై వివాదం చెలరేగింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలిలో ఈ ఘాట్‌ను అభివృద్ధి చేస్తుండగా, దీనికి ‘దేవాన్ష్ ఘాట్’ అని పేరు పెట్టినట్లు బోర్డులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ వివాదంపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యక్తిగత పేర్లు పెట్టడం తగదని స్పష్టం చేశారు. వెంటనే ఆ పేరును తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకువచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!