12, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రియుడితో కలిసి కుమారుడిని హత్య చేయించిన తల్లి

Writer: Pooja 10:29 AM, 11 నవంబర్, 2026
ప్రియుడితో కలిసి కుమారుడిని హత్య చేయించిన తల్లి

కర్ణాటకలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో 24 ఏళ్ల కుమారుడు విజయ్ నారాయణను హత్య చేసేందుకు 44 ఏళ్ల తల్లి మీనా నారాయణ తన ప్రియుడితో కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. నవంబర్ 1న ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కేసు దర్యాప్తులో భాగంగా బెళగావి జిల్లా మాళమారుతి పోలీసులు మీనా నారాయణ, ఆమె ప్రియుడు రాకేశ్ జామూనితో పాటు అతని స్నేహితులు సచిన్ కాంబ్లె, మనోజ్ కాంబ్లె, తమ్మణ్ణ కాంబ్లె, ఏకనాథ్ కాంబ్లెలను అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని గడెహింగ్లజ తాలూకా తేరణి గ్రామానికి చెందిన రాకేశ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం భర్త మరణించడంతో మీనా బెంగళూరులోని ఓ బ్యూటీ పార్లర్‌లో మేనేజర్‌గా చేరింది. అక్కడే రాకేశ్‌తో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు.

తల్లి, రాకేశ్ మధ్య సంబంధాన్ని గుర్తించిన విజయ్ ఆమె తీరును తప్పుబట్టి, బుద్ధి చెప్పినట్లు సమాచారం. దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న కుమారుడిని హత్య చేయాలని మీనా, రాకేశ్ కలిసి పథకం రచించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నవంబర్ 1న సొంతూరు బెళగావికి వెళ్దామని చెప్పి మీనా కుమారుడిని కారులో తీసుకెళ్లింది. ప్రయాణ సమయంలో రాకేశ్‌తో కలిసి శీతల పానీయంలో నిద్రమాత్రలు కలిపి విజయ్‌కు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను నిద్రలోకి జారుకున్న తర్వాత కారులోనే శాలువాతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం బెళగావి చేరుకున్నాక మృతదేహాన్ని రహదారి పక్కన పడేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ హత్యలో రాకేశ్ స్నేహితులు కూడా సహకరించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ ప్రకాశ్ నిక్కం వెల్లడించారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

ట్యాగ్లు
కర్ణాటక హత్య కేసుబెళగావి నేరంతల్లి కుమారుడి హత్యవివాహేతర సంబంధంపోలీసుల దర్యాప్తునేర వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
జనరల్

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!