
రాజకీయాలు

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రచించిన ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. కోవింద్ వ్యక్తిగత జీవితం, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, ప్రజా జీవితంలోని అనుభవాలు ఈ పుస్తకంలో ప్రస్తావించారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కోవింద్ సామాన్య పౌరుడి స్థాయి నుంచి దేశ రాష్ట్రపతిగా ఎదిగారని మోదీ కొనియాడారు.
ప్రజాసేవలో కోవింద్ ప్రదర్శించిన వినయం, క్రమశిక్షణ, విలువలు, రాజ్యాంగంపై ఆయనకున్న నిబద్ధత యువతకు ఆదర్శమని ప్రధాని మోదీ అన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికీ ఎదిగే అవకాశాలను కల్పిస్తుందనడానికి కోవింద్ జీవితం ఒక గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఈ పుస్తకం స్ఫూర్తినిచ్చే విలువైన వారసత్వంగా నిలుస్తుందని మోదీ అన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!