

ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబరులో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. డిసెంబరు 14, 15 తేదీల్లో ఫ్లోరిడాలోని మియామిలో అమెరికా నిర్వహించనున్న జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరయ్యే అవకాశం ఉందని అమెరికాలో భారత రాయబారి సెర్గియో గోర్ గతంలో తెలిపారు. ఈ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశం ఉందని కూడా గోర్ సెప్టెంబరులో సూచించారు. అయితే, మోదీ అమెరికా పర్యటనపై భారత ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మరోవైపు, రష్యా, ఇరాన్‌పై ఆంక్షలను మరింత కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన ‘లిండ్సే ఓ. గ్రాహం రష్యా, ఇరాన్ ఆంక్షల చట్టం-2026’పై ట్రంప్ సెప్టెంబరు 18న సంతకం చేశారు. ఈ చట్టం ప్రకారం రష్యా నుంచి చమురు, సహజవాయువును కొనుగోలు చేసే దేశాలపై గరిష్ఠంగా 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభించింది. ఈ నిబంధనలు భారత్, చైనా వంటి దేశాలకు కూడా వర్తించే అవకాశం ఉంది. అయితే 100 శాతం సుంకాలు వెంటనే అమల్లోకి రావు. వాటిని విధించాలా వద్దా అనే తుది నిర్ణయం అమెరికా అధ్యక్షుడిదే.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!