
జనరల్

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చమురు సరఫరా సమస్యలు, వాటి ప్రభావాలపై ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయంలో నేడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పశ్చిమాసియా పరిస్థితుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, ఇంధన రంగంపై పడే ప్రభావాలను ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వివిధ మంత్రిత్వశాఖల కార్యదర్శులతో కలిసి ఏడు ప్రత్యేక అధికార బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో చమురు నిల్వలు, సరఫరా వ్యవస్థ, ధరల మార్పులపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!