

హైదరాబాద్‌లో ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ ఛార్జీలను మరోసారి పరిశీలించనున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉమ్మడి పాస్‌ల ధరలు సామాన్య ప్రజలకు భారంగా ఉన్నాయన్న అభిప్రాయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనల మేరకు త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ఛార్జీల అంశంపై చర్చించనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం రోజువారీ ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ ధర రూ.400గా ఉంది. ఇందులో మెట్రో వాటా రూ.300 కాగా, ఆర్టీసీ వాటా రూ.100. ఇక నెలవారీ ఉమ్మడి పాస్ ధర రూ.8,500గా ఉండగా, ఇందులో మెట్రోకు రూ.7,000, ఆర్టీసీకి రూ.1,500 కేటాయించారు. ఈ ఛార్జీలను పునఃసమీక్షించిన అనంతరం ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా ఏమైనా మార్పులు ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!