13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేడియల్‌ రోడ్డు-2 టెండర్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

Writer: Shivani K 06:33 AM, 13 అక్టోబర్, 2026
రేడియల్‌ రోడ్డు-2 టెండర్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ చేపట్టిన 81.15 కిలోమీటర్ల రేడియల్‌ రోడ్డు-2 నిర్మాణ పనుల టెండర్‌ వివాదంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్వాల్‌గూడ నుంచి నాచారం వరకు చేపట్టనున్న ఈ రహదారి నిర్మాణ కాంట్రాక్టును పొందిన ఎల్‌-1 బిడ్డర్‌ను కేసులో ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించింది. టెండర్‌ ప్రక్రియలో సాంకేతిక, ఆర్థిక బిడ్‌లలో అర్హత సాధించిన కాంట్రాక్టర్‌ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయకముందే టెండర్‌ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది. సాంకేతిక బిడ్‌లో తమను అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సుశీ ఇన్‌ఫ్రా అండ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు.

పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదిస్తూ, అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని సరిగా పరిశీలించకుండానే తమ సంస్థను అనర్హులుగా ప్రకటించారని తెలిపారు. టెండర్‌ నిబంధనల ప్రకారం పత్రాల్లో సందేహాలుంటే వివరణ కోరాల్సి ఉందని పేర్కొన్నారు. కాంట్రాక్టు పొందిన సంస్థ కంటే రూ.600 కోట్లు తక్కువగా కోట్‌ చేశామని, తమ వాదనను పరిగణనలోకి తీసుకోకపోతే ప్రజాధనం వృథా అయ్యే అవకాశం ఉందని వాదించారు. మరోవైపు, సాంకేతిక అర్హతలు లేకపోవడంతోనే పిటిషనర్‌ బిడ్‌ను తిరస్కరించినట్లు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ తేరా రజనీకాంత్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, సాంకేతిక అర్హత ధ్రువీకరణ పత్రం చెల్లుబాటుపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పనామాలో మరోసారి భూకంపం.. 6.0 తీవ్రతతో ప్రకంపనలు

పనామాలో మరోసారి భూకంపం.. 6.0 తీవ్రతతో ప్రకంపనలు

ట్రంప్ పార్టీకి మస్క్ భారీ ఆర్థిక సాయం

ట్రంప్ పార్టీకి మస్క్ భారీ ఆర్థిక సాయం

చంద్రబాబుతో నేడు మాధవ్‌ భేటీ.. సీట్లపై చర్చలు

చంద్రబాబుతో నేడు మాధవ్‌ భేటీ.. సీట్లపై చర్చలు

ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ విజేతలుగా రాబర్ట్‌ హాల్‌, మైకేల్‌ వుడ్‌ఫోర్డ్‌

ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ విజేతలుగా రాబర్ట్‌ హాల్‌, మైకేల్‌ వుడ్‌ఫోర్డ్‌

పరిశ్రమలకు అనుమతుల సరళీకరణ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

పరిశ్రమలకు అనుమతుల సరళీకరణ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

భారత నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌

భారత నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌

ట్యాగ్లు
రేడియల్‌ రోడ్డు-2తెలంగాణ హైకోర్టుహైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌టెండర్‌ వివాదంసుశీ ఇన్‌ఫ్రాఎల్‌-1 బిడ్డర్‌కొత్వాల్‌గూడనాచారంరహదారి నిర్మాణంప్రభుత్వ కౌంటర్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చర్మం, జుట్టు సంరక్షణకు మందారం.. నిపుణులు చెబుతున్న ప్రయోజనాలివే!
ఆరోగ్యం

చర్మం, జుట్టు సంరక్షణకు మందారం.. నిపుణులు చెబుతున్న ప్రయోజనాలివే!

ఆరోగ్యానికి మఖానా మంచిదేనా? వైద్యుల సూచనలు ఇవే!
ఆరోగ్యం

ఆరోగ్యానికి మఖానా మంచిదేనా? వైద్యుల సూచనలు ఇవే!

వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై కోచ్ ఆగ్రహం
క్రీడలు

వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై కోచ్ ఆగ్రహం

పనామాలో మరోసారి భూకంపం.. 6.0 తీవ్రతతో ప్రకంపనలు
జనరల్

పనామాలో మరోసారి భూకంపం.. 6.0 తీవ్రతతో ప్రకంపనలు

ట్రంప్ పార్టీకి మస్క్ భారీ ఆర్థిక సాయం
జనరల్

ట్రంప్ పార్టీకి మస్క్ భారీ ఆర్థిక సాయం

సెలక్షన్ నిర్ణయాల్లో స్నేహాలకు చోటు లేదు: సందీప్ పాటిల్
క్రీడలు

సెలక్షన్ నిర్ణయాల్లో స్నేహాలకు చోటు లేదు: సందీప్ పాటిల్

ఎస్‌ఐఆర్‌ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

చంద్రబాబుతో నేడు మాధవ్‌ భేటీ.. సీట్లపై చర్చలు
జనరల్

చంద్రబాబుతో నేడు మాధవ్‌ భేటీ.. సీట్లపై చర్చలు

ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ విజేతలుగా రాబర్ట్‌ హాల్‌, మైకేల్‌ వుడ్‌ఫోర్డ్‌
జనరల్

ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ విజేతలుగా రాబర్ట్‌ హాల్‌, మైకేల్‌ వుడ్‌ఫోర్డ్‌

పరిశ్రమలకు అనుమతుల సరళీకరణ.. ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

పరిశ్రమలకు అనుమతుల సరళీకరణ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

భారత నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌
జనరల్

భారత నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌

అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను కాపాడాలి: నవీ పిళ్లై
జనరల్

అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను కాపాడాలి: నవీ పిళ్లై

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!