

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ–2026 నోటిఫికేషన్‌పై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. రోస్టర్ వివరాలను వెల్లడించకుండానే పోస్టుల ప్రకటన జారీ చేయడంతో ఏ సామాజిక వర్గానికి ఎన్ని పోస్టులు కేటాయించారనే అంశంపై స్పష్టత కరవైంది. ఇప్పటికే విడుదల చేసిన షార్ట్ నోటిఫికేషన్‌తో పాటు తాజాగా ప్రకటించిన నోటిఫికేషన్‌లోనూ రోస్టర్ వివరాలు లేకపోవడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. అసలు ఏయే పోస్టులు అందుబాటులో ఉన్నాయో, వాటిలో తమకు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో తెలియక అభ్యర్థులు తికమకపడుతున్నారు.
మరోవైపు, డీఎస్సీ–2026 దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అయితే నోటిఫికేషన్‌లో స్పష్టత లేని అంశాలపై అభ్యర్థులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో భారీ మార్పులు చేయడం చర్చనీయాంశంగా మారింది. గత డీఎస్సీ నియామకాల సందర్భంగా చోటుచేసుకున్న అక్రమాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, తాజా మార్పులు గతంలో జరిగిన లోపాలను పరోక్షంగా అంగీకరించినట్లుగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!