

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కు వర్షాల ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13న కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఇది క్రమంగా వాయవ్య దిశగా పయనిస్తూ, తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల అర్నబ్, మురసు తుపాన్ల ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించి తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో తాజా వాతావరణ పరిణామం ఆందోళన కలిగిస్తోంది.
ఈ అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 14, 15 తేదీల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర పరిసరాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. అలల ఉద్ధృతి పెరగడంతో పాటు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని IMD తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం కదలికలు, తీవ్రతను అధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!