
టెక్నాలజీ

హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం భారీ శబ్దం వినిపించడంతో పలుచోట్ల స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉప్పర్‌పల్లి, ఎర్రబోడ, లంగర్‌హౌస్, కేశవస్వామినగర్ ప్రాంతాల్లో ఉదయం 9.15 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు అనిపించేలా శబ్దం వినిపించింది. దీంతో అసలు ఏం జరిగిందో తెలియక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఎక్కడైనా పేలుడు జరిగిందా, భూకంపం వచ్చిందా అంటూ చర్చించుకున్నారు.
మరోవైపు, రాజేంద్రనగర్ పరిసరాల్లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు అనిపించిందని స్థానికులు తెలిపారు. భారీ శబ్దానికి గల కారణం ఏమిటనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, ఈ శబ్దం వెనుక అసలు కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అధికారిక సమాచారం వెలువడే వరకు శబ్దానికి కారణాన్ని నిర్ధారించలేం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!