

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా ఆధీనంలోని ఉక్రెయిన్ నగరం ఒలెష్కీలో మంగళవారం తెల్లవారుజామున స్థానిక కాల్పుల విరమణ ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. నగరంలో చిక్కుకుపోయిన పౌరులకు మానవతా సాయం అందించడంతో పాటు, అక్కడి నుంచి బయటకు వెళ్లాలనుకునేవారికి సురక్షిత మార్గాలు ఏర్పాటు చేయడం ఈ సంధి ప్రధాన ఉద్దేశం.
2022లో రష్యా ఆక్రమణలోకి వెళ్లిన ఖేర్సన్ ప్రాంతంలోని ఒలెష్కీ నగరం ప్రస్తుతం తీవ్ర మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, మంచినీరు, మందుల కొరతతో ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మెలానియా ట్రంప్ సెప్టెంబర్‌లో ఐరాస సమావేశాల సందర్భంగా ఈ సమస్యపై చర్చలు ప్రారంభించగా, ఇరు దేశాల ప్రతినిధులు మానవతా సహాయం, పౌరుల తరలింపు, మైన్ల తొలగింపు వంటి అంశాలపై సమన్వయం చేసుకున్నారు. అయితే, ఈ కాల్పుల విరమణ అమలు ఎంతవరకు సజావుగా సాగుతుందన్నది కీలకం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!