

కొండా సుస్మిత రాజకీయ భవిష్యత్తుపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఆమె జనసేనలో చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా రేపు హైదరాబాద్‌లో జనసేనకు చెందిన కీలక నేతలతో సుస్మిత భేటీ కానున్నట్లు రాజకీయ వర్గాల్లో సమాచారం చక్కర్లు కొడుతోంది.
ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె తన తదుపరి రాజకీయ అడుగులపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన నేతలతో జరగనున్నట్లు చెబుతున్న భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ సమావేశంలో పరకాల అసెంబ్లీ టికెట్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ బాధ్యతలు అప్పగించే అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని ఓ కీలక నేత నివాసంలో ఈ భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
అయితే జనసేనలో కొండా సుస్మిత చేరికపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. రేపటి భేటీలో ఏ అంశాలపై చర్చ జరుగుతుంది, ఆమె రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!