
రాజకీయాలు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ యార్డ్ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగనున్న శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
179 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ఈ మార్కెట్ దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్‌గా నిలవనుంది. ఉద్యాన పంటల సాగు విస్తరణ, రైతుల ఆదాయ వృద్ధి, ఆధునిక మార్కెటింగ్ సదుపాయాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతోంది. కోహెడ పండ్ల మార్కెట్ రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు వరంగా మారుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!