
జనరల్

జేడీ వాన్స్ తన వైవాహిక జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రవాస భారతీయురాలు ఉష వాన్స్ ను వివాహం చేసుకోకపోతే తాను జీవితాంతం బ్యాచిలర్‌గానే ఉండిపోయేవాడినని వెల్లడించారు. వచ్చే నెల విడుదల కానున్న తన ఆత్మకథలో ఈ విషయాలను పంచుకున్నారు. యేల్ లా స్కూల్లో తొలిసారి ఉషను కలిసినట్లు పేర్కొన్న ఆయన, ఆమె అందం, తెలివితేటలు, సంప్రదాయ విలువలు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు.
తాను ఉషను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అప్పుడే స్నేహితులతో చెప్పినట్లు వాన్స్ వెల్లడించారు. 2014లో వీరి వివాహం హిందూ సంప్రదాయంలో జరిగింది. ప్రస్తుతం వీరికి ముగ్గురు పిల్లలు ఉండగా, త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం. తన బాల్యంలో ఎదుర్కొన్న పేదరికం, కుటుంబ సమస్యలపై హిల్‌బిల్లీ ఎలెజీ పుస్తకాన్ని రచించిన వాన్స్, ఆ పుస్తకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!