

దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్-30లోని 11 ప్రముఖ కంపెనీల్లో కొత్త నియామకాలు గత ఏడాదితో పోలిస్తే 27 శాతం తగ్గినట్లు వచ్చిన నివేదికలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ ఆర్థిక మరియు ఉద్యోగ విధానాల వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు.
దేశంలోని అగ్రగామి సంస్థల్లోనే నియామకాలు తగ్గితే, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండే అవకాశముందని జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన సోషల్ మీడియా రీల్స్‌ను ఉద్దేశించి యువతకు ప్రచార వీడియోలు కాదు, స్థిరమైన ఉద్యోగాలే అవసరమని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం అంగీకరించి ఉపాధి కల్పనపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!