
జనరల్

వ్యవసాయ రంగంలో ఇజ్రాయెల్ మరో ఘనత సాధించింది. ఎడారి ప్రాంతమైన నెగేవ్‌లో భారీ స్థాయిలో ద్రాక్ష తోటలు పెంచుతూ వైన్ ఉత్పత్తి చేయడంతో ఆ ప్రాంతం అంతర్జాతీయ వైన్ రీజియన్‌గా గుర్తింపు పొందింది. షాంపెయిన్, చియాంటీ, నాపా వ్యాలీ వంటి ప్రపంచ ప్రఖ్యాత వైన్ ప్రాంతాల సరసన నెగేవ్ నిలిచింది.
ఇజ్రాయెల్ ప్రభుత్వ సహకారంతో మెరేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా సాగుతున్న ద్రాక్ష సాగు ఈ విజయానికి కారణమైంది. ఎడారి ప్రాంతంలో వ్యవసాయం చేయడం సవాలుగా మారినా స్థానిక రైతులు, వైన్ తయారీదారులు కృషితో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ప్రస్తుతం 60కి పైగా వైన్ తయారీ కేంద్రాల ద్వారా ప్రతి ఏడాది 10 లక్షలకు పైగా వైన్ సీసాలు ఉత్పత్తి అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!