

పశ్చిమాసియాలో ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఈ వారం ప్రారంభం నుంచి ఇరుదేశాలు పరస్పరం దాడులు కొనసాగిస్తున్నాయి. రాత్రి వేళ ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై అమెరికా దాడులు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ వివాహ వేడుక జరుగుతున్న ఇంటిపై క్షిపణి శకలాలు పడటంతో చిన్నారి సహా నలుగురు మృతి చెందగా, మరో 50 మంది గాయపడ్డారు. దీనికి ప్రతిగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లోని అమెరికాకు చెందిన ఆస్తులపై దాడులు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ బలగాలు అగ్రరాజ్యానికి మర్చిపోలేని గుణపాఠం నేర్పుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ వారం ఘర్షణలు ప్రారంభమైన తర్వాత ఆయన తొలిసారి స్పందించారు. అమెరికా ఎందుకు దాడులు చేసిందో పశ్చాత్తాపపడేలా చేస్తామని ఐఆర్‌జీసీ ప్రతినిధి హుస్సేన్ మొహెబి హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిలో సముద్ర మైన్లను తొలగించినట్లు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో, ఇరాన్ మళ్లీ మైన్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోందన్న ఆరోపణలతో అమెరికా రాకెట్ ప్రయోగ వేదికలపై దాడులు జరిపినట్లు సమాచారం.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!