
సినిమాలు

తిరుపతిలోని పెద్దకాపు లేఔట్‌లో ఉన్న టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథం నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో టెంపుల్ డిప్యూటీ ఈఓగా విధులు నిర్వహిస్తున్న లోకనాథం, గతంలో కూడా టీటీడీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయనకు ఉన్న ఆస్తులపై సమాచారం అందడంతో ఏసీబీ ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
సోదాల సమయంలో డిప్యూటీ ఈఓ లోకనాథం ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. తిరుమలలోని ఆయన కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు వాటికి సంబంధించిన వివరాలు, పత్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోదాలు పూర్తైన అనంతరం ఆస్తులు, ఇతర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!