18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..

Writer: Chandrika 09:54 AM, 2 సెప్టెంబర్, 2026
నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..

నేపాల్‌కు మరోసారి భారీ వరద ముప్పు పొంచి ఉంది. దేశంలోని తూర్పు, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో నదుల నీటిమట్టాలు, ప్రవాహాలు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నువాకోట్‌, రసువా జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని జాతీయ విపత్తు ముప్పు తగ్గింపు, నిర్వహణ అథారిటీ హెచ్చరించింది. పలు చిన్న నదుల్లో నీటిమట్టాలు పెరుగుతున్నట్లు తెలిపింది. టపుల్‌జంగ్‌, సుంఖువసభ, సోలుకుంభ్‌, ఖోటంగ్‌, ఓఖ్లదుంగా, రామెఛాప్‌, డోలఖ, సింధుపాల్‌చౌక్‌, కావ్రేపాలంచోక్‌, లలిత్‌పుర్‌, భక్తపుర్‌, కాఠ్‌మాండూ, ధాడింగ్‌ తదితర జిల్లాలకు కూడా వరద ముప్పు ఉందని అధికారులు వెల్లడించారు. కోశీ, నారాయణి, బాగ్‌మతి, కర్నాలి, మహాకాలి నదులతోపాటు వాటి ఉపనదుల ప్రవాహాలను పర్యవేక్షిస్తున్నారు. రసువాలోని తైమూర్‌లో నదీ ప్రవాహాన్ని నేరుగా గమనించేందుకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వరద పరిస్థితిపై నేపాల్‌ ఇంధనశాఖ మంత్రి బీరజ్‌ భక్త శ్రేష్ఠ వాతావరణ నిపుణులతో సమీక్ష నిర్వహించారు.

నేపాల్‌లో ఇప్పటికే సంభవించిన విపత్తు భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చింది. మంగళవారం నాటికి 1,050 మంది మరణించగా, మరో 4,000 మంది ఆచూకీ తెలియడం లేదని సమాచారం. గల్లంతైన వారిలో 583 మంది విదేశీయులు ఉన్నారు. సహాయక బృందాలు ఇప్పటివరకు 12,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వర్షాలు, నదుల ఉద్ధృతి కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. జలవిద్యుత్తు ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారత్‌, చైనాకు చెందిన నిపుణులు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 280 మందిని సొరంగాల నుంచి రక్షించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, వాతావరణ మార్పులకు కారణమవుతున్న అధిక గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలు చేస్తున్న దేశాల నుంచి పరిహారం కోరాలని నేపాల్‌ నిర్ణయించింది. ఇది దాతృత్వం కాదని, బాధ్యతగా అందించాల్సిన న్యాయపరమైన పరిహారమని నేపాల్‌ పేర్కొంది. హిమాలయాల్లో మంచు వేగంగా కరుగుతున్న నేపథ్యంలో గంగా, త్రిశూలి వంటి నదులపై ఆధారపడే దక్షిణాసియా ప్రజలకు భవిష్యత్తులో తీవ్ర ముప్పు ఉంటుందని ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది. విపత్తు సమయంలో భారత్‌ అందించిన సాయాన్ని నేపాల్‌ బిలియనీర్‌ బినోద్‌ చౌధరి ప్రశంసించారు. 2015 భూకంప సమయంలో భారత్‌ అందించిన సహాయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్

భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరం

భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరం

మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చిన మంత్రి సీతక్క

మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చిన మంత్రి సీతక్క

తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీక సద్దుల బతుకమ్మ

తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీక సద్దుల బతుకమ్మ

సుడిగాలి సుధీర్‌కు 2014లోనే ఎంగేజ్‌మెంట్ జరిగిందా? వైరల్‌గా మారిన పాత ఫోటోలు

సుడిగాలి సుధీర్‌కు 2014లోనే ఎంగేజ్‌మెంట్ జరిగిందా? వైరల్‌గా మారిన పాత ఫోటోలు

ట్యాగ్లు
నేపాల్‌ వరదలునేపాల్‌ విపత్తుఆకస్మిక వరద హెచ్చరికనేపాల్‌ నదులువరద ముప్పువాతావరణ మార్పులుహిమాలయ మంచుభారత్‌ నేపాల్‌ సహాయంచైనా నేపాల్‌ సహాయక చర్యలుదక్షిణాసియా వరదలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా
జనరల్

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్
జనరల్

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్

భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి
జనరల్

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి

దసరా పండగకు మారుతి కార్లపై భారీ ఆఫర్లు
బిజినెస్

దసరా పండగకు మారుతి కార్లపై భారీ ఆఫర్లు

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్
జనరల్

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్

భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరం
జనరల్

భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరం

బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మేనియా.. దూసుకెళ్తున్న ‘జైలర్ 2’
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మేనియా.. దూసుకెళ్తున్న ‘జైలర్ 2’

దసరా కానుకగా ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పటి నుంచంటే?
ఓటీటీ

దసరా కానుకగా ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పటి నుంచంటే?

వైకాపా బురదజల్లే రాజకీయాలు మానుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర
రాజకీయాలు

వైకాపా బురదజల్లే రాజకీయాలు మానుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర

మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చిన మంత్రి సీతక్క
జనరల్

మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చిన మంత్రి సీతక్క

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!