

అబుదాబిలో నివసిస్తున్న 29 ఏళ్ల భారతీయుడు అనిల్‌కుమార్ బొల్లాకు అదృష్టం వరించింది. తన తల్లి పుట్టినరోజుతో సంబంధం ఉన్న నంబర్‌ను ఎంచుకున్న ఆయన ఏఈడీ 100 మిలియన్ల (సుమారు రూ.240 కోట్లు) లాటరీ జాక్‌పాట్‌ను గెలుచుకున్నారు. 2025 అక్టోబర్ 18న జరిగిన యూఏఈ లాటరీ 23వ లక్కీ డే డ్రాలో ఈ విజయం సాధించారు. ఎక్కువ నంబర్లను ఈజీ పిక్ ఆప్షన్ ద్వారా ఎంచుకున్నప్పటికీ, తన తల్లి పుట్టినరోజుతో ప్రత్యేక అనుబంధం ఉన్న 11వ నంబర్‌ను మాత్రం స్వయంగా ఎంపిక చేసుకున్నారు. యూఏఈ లాటరీ చరిత్రలో తొలి 100 మిలియన్ దిర్హామ్ జాక్‌పాట్ విజేతగా ఆయన నిలిచారు.
లాటరీ గెలిచిన విషయం తెలిసినప్పుడు తాను షాక్‌కు గురయ్యానని అనిల్‌కుమార్ తెలిపారు. ఇంత భారీ మొత్తాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలి, బాధ్యతాయుతంగా ఎలా వినియోగించాలనే విషయాలపై ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. తన తల్లిదండ్రుల కలలను నెరవేర్చడం, కుటుంబ సభ్యులను యూఏఈకి తీసుకురావడం, వారితో ఎక్కువ సమయం గడపడం ఆయన ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అంతేకాకుండా, తన విజయంతో వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని అవసరంలో ఉన్నవారికి విరాళంగా ఇవ్వాలని భావిస్తున్నారు. తల్లిపై ప్రేమతో ఎంచుకున్న ఒక నంబర్ తన జీవితాన్ని మార్చే అద్భుతమైన విజయానికి ప్రత్యేక గుర్తుగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!