
జనరల్

అమెరికాలోని పెర్మ్ (PERM) కార్యక్రమం నుంచి ఎనిమిది ఐటీ కంపెనీలను సస్పెండ్ చేసినట్లు వచ్చిన పరిణామాలపై భారత్ స్పందించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన తాజా పరిణామాలను నిరంతరం పరిశీలిస్తున్నామని తెలిపింది. పెర్మ్ కార్యక్రమం, హెచ్-1B వీసా కార్యక్రమం రెండూ వేర్వేరని స్పష్టం చేసింది. అందువల్ల ఈ రెండు కార్యక్రమాలను ఒకటిగా పరిగణించకూడదని పేర్కొంది.
ఇప్పటికే హెచ్-1B వీసా కలిగి ఉన్నవారికి ఈ పరిణామాల వల్ల ప్రత్యక్షంగా ఇబ్బందులు ఉండవని సంబంధిత వివరణలో పేర్కొన్నారు. అయితే, పెర్మ్ ప్రక్రియపై ఆంక్షలు కొనసాగితే సంబంధిత ఐటీ కంపెనీల ఉద్యోగుల గ్రీన్‌కార్డు దరఖాస్తులు, శాశ్వత నివాస హోదా పొందే ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ అంశంపై అమెరికా తీసుకునే తదుపరి చర్యలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!