
బిజినెస్

సౌదీ అరేబియాలోని పలు విమానాశ్రయాలపై హూతీ దాడుల ప్రభావం తీవ్రంగా పడింది. రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయగా, దమ్మాన్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు రెండు గంటల పాటు ఒక్క విమానం కూడా రాకపోకలు సాగించలేదని సమాచారం. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు, జెడ్డా విమానాశ్రయంలోనూ విమానాల రద్దు కొనసాగుతోంది. తాజా వివరాల ప్రకారం, మొత్తం 156 విమానాలు రద్దు కాగా, మరో 374 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ పరిణామాలతో విమాన ప్రయాణాల షెడ్యూళ్లు దెబ్బతిన్నాయి. విమానాశ్రయాల్లో పరిస్థితులు, విమాన సర్వీసుల పునరుద్ధరణపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!