22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ

Writer: Sreekanth Reddy 11:05 AM, 23 జూన్, 2026
ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ

ఈ రోజు నేను మీ ముందు ఒక నటుడిగానో, ప్రజాప్రతినిధిగానో నిలబడలేదు. ఒక కొడుకుగా ఈ వేదికపై ఉన్నాను" అంటూ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్, నందమూరి బాలకృష్ణ అన్నారు.ఆసుపత్రి స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన తల్లి బసవతారకం క్యాన్సర్‌తో పోరాడుతున్న రోజులను గుర్తుచేసుకుంటూ, ఆసుపత్రి ఏర్పాటు వెనుక ఉన్న ఆశయాన్ని వివరించారు.
1984లో తన తల్లి క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు, తమకు చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత ఉందని, కానీ చుట్టూ ఉన్న ఎందరో నిస్సహాయులను చూసి తన తల్లి ఆవేదన చెందారని బాలకృష్ణ తెలిపారు. "డబ్బులున్న మనం చికిత్స చేయించుకోగలుగుతున్నాం, మరి పేదల పరిస్థితి ఏంటి?" అని తన తల్లి అడిగిన ఒక సామాన్యమైన ప్రశ్నే ఈ బృహత్తర కార్యక్రమానికి పునాది వేసిందన్నారు. ఆ ప్రశ్నను తన తండ్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒక బాధ్యతగా స్వీకరించి, డబ్బు లేదన్న కారణంతో ఏ ఒక్కరూ క్యాన్సర్ చికిత్సకు దూరం కాకూడదన్న లక్ష్యంతో 1989లో ఈ సంస్థకు పునాది వేశారని గుర్తుచేసుకున్నారు.

2000వ సంవత్సరంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఆసుపత్రి, నేడు 650 పడకల ప్రపంచ స్థాయి వైద్యశాలగా ఎదిగిందని బాలకృష్ణ వివరించారు. ప్రతిరోజూ 35 నుంచి 40 సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు, 200 మందికి పైగా కీమోథెరపీ, దాదాపు 500 మందికి రేడియేషన్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 3.75 లక్షల మందికి పైగా రోగులకు ఇక్కడ చికిత్స అందించినట్లు వెల్లడించారు.

ఆరోగ్యశ్రీ, పీఎంజేఏవై వంటి ప్రభుత్వ పథకాలు లక్షలాది మంది ప్రాణాలను కాపాడాయని చెబుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల వరకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేట్ సంస్థలు, తానా, నాట్స్ వంటి విదేశీ తెలుగు సంఘాలు, దాతలు, అభిమానుల సహకారం మరువలేనిదన్నారు. వైద్యులు, నర్సులు, సిబ్బంది కేవలం ఉద్యోగం చేయట్లేదని, ప్రాణాలను నిలబెట్టే బాధ్యతను మోస్తున్నారని వారి సేవలను కొనియాడారు.

ఈ ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, అమరావతిలో 1000 పడకలతో మరో ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఆసుపత్రిని కూడా మరింత విస్తరిస్తున్నట్లు తెలిపారు. డబ్బు లేక ఏ రోగి నిస్సహాయంగా వెనుదిరగకూడదన్న తమ తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చే వరకు ఈ ప్రయాణం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం

కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!

ఢిల్లీ: ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

ఢిల్లీ: ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

ట్యాగ్లు
నందమూరి బాలకృష్ణబసవతారకం క్యాన్సర్ హాస్పిటల్25 ఏళ్ల వేడుకహెచ్ ఐ సీసీక్యాన్సర్ఎన్టీఆర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలు.. చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలు.. చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్

జగన్‌ను కలిసేది పెళ్లి ఆహ్వానం కోసమే: షర్మిల
రాజకీయాలు

జగన్‌ను కలిసేది పెళ్లి ఆహ్వానం కోసమే: షర్మిల

కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం
జనరల్

కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ
జనరల్

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు
జనరల్

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్
జనరల్

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్

ఆపిల్‌లో మరోసారి ఉద్యోగ కోతలు.. ఫిట్‌నెస్ టీమ్‌పై ప్రభావం!
టెక్నాలజీ

ఆపిల్‌లో మరోసారి ఉద్యోగ కోతలు.. ఫిట్‌నెస్ టీమ్‌పై ప్రభావం!

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!
జనరల్

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!

ఢిల్లీ: ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
జనరల్

ఢిల్లీ: ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

గిద్దలూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభం!
జనరల్

గిద్దలూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభం!

సోషల్ మీడియాకు ఐశ్వర్యలక్ష్మి గుడ్‌బై.. అసలు కారణం ఇదే!
సినిమాలు

సోషల్ మీడియాకు ఐశ్వర్యలక్ష్మి గుడ్‌బై.. అసలు కారణం ఇదే!

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్
క్రీడలు

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!