5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ వ్యాప్తంగా పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌..

Writer: Chandrika 09:21 AM, 5 నవంబర్, 2026
ఏపీ వ్యాప్తంగా పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌..

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ఓటర్లు బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 21,012 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 31,460 పోలింగ్‌ కేంద్రాల్లో 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 2,128 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో ఎంపీటీసీ పదవులకు 18,843 మంది, జడ్పీటీసీ పదవులకు 2,169 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

పరిషత్‌ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,01,116 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని నియమించారు. వీరిలో రిటర్నింగ్‌ అధికారులు, ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు, జోనల్‌ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు తదితరులు ఉన్నారు. అయితే భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఐదు మండలాల్లో పూర్తిగా, మరో మండలంలోని రెండు పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలంలో పోలింగ్‌ను వాయిదా వేశారు. ఈ ప్రాంతాల్లో గురువారానికి బదులుగా శుక్రవారం ఓటింగ్‌ నిర్వహించనుండగా.. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. కేంద్ర ప్రభుత్వ శాఖలు, బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. కేంద్ర ప్రభుత్వ శాఖలు, బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు!

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లకు భారీ షాక్

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లకు భారీ షాక్

ఆడపిల్లల పుట్టుకను వేడుకగా మార్చుతున్న పుణె వైద్యుడు!

ఆడపిల్లల పుట్టుకను వేడుకగా మార్చుతున్న పుణె వైద్యుడు!

హైదరాబాద్ మెట్రో టికెటింగ్‌లో సాంకేతిక సమస్యలు..

హైదరాబాద్ మెట్రో టికెటింగ్‌లో సాంకేతిక సమస్యలు..

నగరంలో ఆహార భద్రత తనిఖీలు..

నగరంలో ఆహార భద్రత తనిఖీలు..

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలుపరిషత్‌ ఎన్నికలుజడ్పీటీసీ ఎన్నికలుఎంపీటీసీ ఎన్నికలుఏపీ రాజకీయాలుస్థానిక సంస్థల ఎన్నికలుపోలింగ్‌ అప్‌డేట్స్‌ఓటర్ల సంఖ్యరాష్ట్ర ఎన్నికల సంఘంఏలూరు జిల్లాతూర్పుగోదావరి జిల్లాభారీ వర్షాలుఎన్నికల కౌంటింగ్‌ఆంధ్రప్రదేశ్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైత్రీ మూవీ మేకర్స్ హారర్ మూవీకి ఓటీటీ డేట్ ఫిక్స్?
ఓటీటీ

మైత్రీ మూవీ మేకర్స్ హారర్ మూవీకి ఓటీటీ డేట్ ఫిక్స్?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 ప్రోమో 1: నీతూ మాస్టర్ వర్సెస్ త్రిగుణ్..ప్రోమోలో హీట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 ప్రోమో 1: నీతూ మాస్టర్ వర్సెస్ త్రిగుణ్..ప్రోమోలో హీట్

కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!
సినిమాలు

కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు
జనరల్

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు

వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు!
బిజినెస్

వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు!

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైవాహిక జీవితంలోని కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైవాహిక జీవితంలోని కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్

తెలుగు నటిగా గర్విస్తున్నా..టాలీవుడ్‌కు ఎప్పటికీ అండగా ఉంటా – పాయల్ రాజ్‌పుత్
సినిమాలు

తెలుగు నటిగా గర్విస్తున్నా..టాలీవుడ్‌కు ఎప్పటికీ అండగా ఉంటా – పాయల్ రాజ్‌పుత్

ఇండిగో విమానాల్లో బిజినెస్ క్లాస్ ఫ్లాట్‌బెడ్ సీట్లు.. ప్రయాణికులకు లగ్జరీ సౌకర్యాలు!
బిజినెస్

ఇండిగో విమానాల్లో బిజినెస్ క్లాస్ ఫ్లాట్‌బెడ్ సీట్లు.. ప్రయాణికులకు లగ్జరీ సౌకర్యాలు!

ఎనిమిదో వారంలోనే ఝాన్సీ ప్రయాణం ముగింపు.. రెమ్యునరేషన్ ఎంతంటే?
షోస్

ఎనిమిదో వారంలోనే ఝాన్సీ ప్రయాణం ముగింపు.. రెమ్యునరేషన్ ఎంతంటే?

మెర్సిడెస్ బెంజ్ నుంచి సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల!
బిజినెస్

మెర్సిడెస్ బెంజ్ నుంచి సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల!

కష్టకాలంలో కోహ్లీ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి: పీవీ సింధు
క్రీడలు

కష్టకాలంలో కోహ్లీ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి: పీవీ సింధు

‘రామాయణ’ చిత్ర బృందానికి అల్లు అర్జున్ శుభాకాంక్షలు
సినిమాలు

‘రామాయణ’ చిత్ర బృందానికి అల్లు అర్జున్ శుభాకాంక్షలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!