
జనరల్

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణపై న్యూఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగింది. ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు.
మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన రుణాలు, నిధులు మరియు రెండో దశకు అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, మెట్రో రైలు సంస్థ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ కూడా పాల్గొని విస్తరణ ప్రణాళికలపై చర్చించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!