
జనరల్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. నిన్న సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం, స్వామివారి సర్వదర్శనానికి సుమారు పది గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 29 గదుల్లో సర్వదర్శన భక్తులు వేచివుండగా, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని ఐదు గదుల్లో సమయానుసార దర్శన భక్తులు నిరీక్షిస్తున్నారు.
గురువారం మొత్తం 70,001 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదే రోజు 30,085 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం హుండీ ఆదాయం మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలకు చేరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!