
ఆరోగ్యం

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం భక్తుల రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులు, వారాంతపు సెలవుల నేపథ్యంలో ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో రేపటి నుంచి సోమవారం వరకు వీఐపీ బ్రేక్ (స్పర్శ) దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ కాలంలో సాధారణ భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
అయితే ముందుగానే ఆన్లైన్ ద్వారా స్పర్శ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు యథావిధిగా స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. భక్తులందరూ ఈ మార్పులను గమనించి దేవస్థానం నిర్వహణకు సహకరించాలని ఈవో విజ్ఞప్తి చేశారు. రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!