

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా హైకోర్టులో వాడివేడి వాదనలు వినిపించాయి. భగీరథ్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదిస్తూ, బాధితురాలు మైనర్ కాదని, ఈ కేసులో పోక్సో చట్టం వర్తించదని తెలిపారు. గతంలో ఒక కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ప్రకారం బాధితురాలు మేజర్ అని పేర్కొన్నారు. అలాగే బాధితురాలికి రెండు వేర్వేరు పుట్టిన తేదీ సర్టిఫికెట్లు ఉన్నాయని, వాటిలో ఏది సరైనదో కోర్టు నిర్ణయించాల్సి ఉందని తెలిపారు.
భగీరథ్ నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు తమ వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని సీల్డ్ కవర్లో సమర్పించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. భగీరథ్‌పై రాజకీయ కారణాలతో దుష్ప్రచారం జరుగుతోందని, మీడియా ట్రయల్స్ ద్వారా ముందుగానే అతన్ని దోషిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. మధ్యంతర రక్షణ కల్పిస్తే విచారణకు పూర్తిగా సహకరిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో మధ్యంతర రక్షణ పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులను వాయిదా వేసి, ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!