
జనరల్

జనసేన పార్టీ నేత, తన సోదరుడు నాగబాబుకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాసన మండలి సభ్యుడిగా, ఏపీ గ్రీన్ ఛైర్మన్గా నాగబాబు మరింతగా ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన తన సందేశంలో నాగబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన భవిష్యత్తులో మరిన్ని బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
నాగబాబుకు పర్యావరణ పరిరక్షణపై సహజంగానే ఆసక్తి ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆ అభిరుచి ఏపీ గ్రీన్ ఛైర్మన్గా ఆయన నిర్వహించే బాధ్యతలకు మరింత గుర్తింపు తీసుకొస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నాగబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!