
జనరల్

ప్రమాదకర హైడ్రోక్లోరిక్ యాసిడ్ (హెచ్‌సీఎల్) తీసుకెళ్తున్న ట్యాంకర్ నుంచి లీకేజీ కావడంతో విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొవ్వూరులోని ఆంధ్ర షుగర్స్ నుంచి భీమిలి ప్రాంతంలోని దివీస్ ల్యాబ్‌కు రసాయనం తరలిస్తున్న ట్యాంకర్‌ను జాతీయ రహదారిపై ఓ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది.
మరమ్మతుల అనంతరం సాయంత్రం ట్యాంకర్‌ను కదిలించే ప్రయత్నంలో లీకేజీ ప్రారంభమైంది. యాసిడ్ రోడ్డుపై పడటంతో దట్టమైన పొగలు ఏర్పడి ప్రయాణికుల కళ్లు, గొంతు మండే సమస్యలు కలిగాయి. దీంతో సుమారు అరగంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రహదారి పక్క గ్రిల్స్ తొలగించి ట్యాంకర్‌ను సమీపంలోని చెరువు వద్దకు తరలించారు. అనంతరం భద్రతా చర్యలు పూర్తిచేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!