
గాసిప్స్

అమెరికాలో ఏడేళ్లపాటు నిరంతరాయంగా నివసిస్తున్న వలసదారులకు గ్రీన్ కార్డులు ఇవ్వాలని డెమొక్రాటిక్ పార్టీ సెనేటర్ అలెక్స్ పాడిల్లా మరోసారి సెనెట్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. ‘ది రిన్యూవింగ్ ఇమ్మిగ్రేషన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 1929’ పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లు దీర్ఘకాలంగా అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు శాశ్వత నివాస హక్కు కల్పించడమే లక్ష్యంగా రూపొందించారు.
అమెరికా వలస చట్టాలకు మరింత మానవీయ దృక్పథం అవసరమని అలెక్స్ పాడిల్లా పేర్కొన్నారు. వలసదారులపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో అమలైన కఠిన విధానాలను వ్యతిరేకిస్తూ ఏడాది క్రితమే ఈ బిల్లును ప్రతిపాదించానని, అప్పటి నుంచి వలసదారులపై చర్యలు మరింత తీవ్రతరమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!