
జనరల్

కార్తిక మాసం సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఆలయ అధికారులు విశేష గాజుల అలంకరణ చేశారు. మూలవిరాట్టుతో పాటు గర్భాలయం, ఆలయ ప్రాంగణాన్ని ఎనిమిది లక్షలకు పైగా రంగురంగుల గాజులతో అందంగా అలంకరించారు. ఈ ప్రత్యేక అలంకరణతో ఆలయ పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. అమ్మవారి గాజుల అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
నేడు భగినీ హస్త భోజనం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. కార్తిక మాసంలో అమ్మవారి ఈ విశేష అలంకరణను దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!