

2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు సంబంధించిన ఫెమా ఉల్లంఘన కేసులో మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోదీకి భారీ ఊరట లభించింది. ఆయనపై విధించిన రూ.10.65 కోట్ల జరిమానాను ఫెమా అప్పిలేట్ ట్రిబ్యునల్ పూర్తిగా రద్దు చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భద్రతా కారణాలతో భారత్‌లో టోర్నీ నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో దక్షిణాఫ్రికాకు తరలించిన నిర్ణయంలో లలిత్ మోదీ కీలక పాత్ర పోషించారని ట్రిబ్యునల్ పేర్కొంది. తీర్పు అనంతరం లలిత్ మోదీ డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్రిబ్యునల్ పరిశీలనలో ఐపీఎల్ 2009కు సంబంధించిన విదేశీ లావాదేవీలు క్యాపిటల్ అకౌంట్ పరిధిలో కాకుండా కరెంట్ అకౌంట్ ఫారిన్ రిమిటెన్స్ కింద జరిగినట్లు స్పష్టమైంది. అలాగే బీసీసీఐ తరఫున ఫెమా నిబంధనల అమలుకు లలిత్ మోదీ బాధ్యుడు కాదని, ఆర్థిక నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఆయనకు లేదని ట్రిబ్యునల్ పేర్కొంది. ఇదే కేసులో మాజీ బీసీసీఐ కార్యదర్శి ఎన్. శ్రీనివాసన్, మాజీ ఖజానాదారు ఎం.పీ. పాండోవ్ మరియు బీసీసీఐపై విధించిన జరిమానాలను తగ్గించిన ట్రిబ్యునల్, మరో ఫెమా అంశానికి సంబంధించిన కేసులో శ్రీనివాసన్, పాండోవ్‌లపై విధించిన జరిమానాలను మాత్రం యథాతథంగా కొనసాగించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!