

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విద్యను కొత్త దిశలో తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (టీపీఎస్)ను ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమంలో తొలి టీపీఎస్ ఆరుట్లలో ప్రారంభించనున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
ముఖ్యమంత్రి ఉదయం 9:30 గంటలకు ఆరుట్లకు చేరుకుని టీపీఎస్‌ను ప్రారంభిస్తారు. అనంతరం డిజిటల్ క్లాస్‌రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుని, విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకుంటారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
టీపీఎస్‌లో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. ఇంగ్లీష్ మీడియంలో ఆధునిక బోధనా పద్ధతులతో విద్య అందించబడుతుంది. పైలట్ ప్రాజెక్ట్‌గా నాలుగు పాఠశాలలు ఎంపిక చేయగా, దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!