
రాజకీయాలు

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), భారత నౌకాదళం కలిసి ఒడిశా తీరానికి సమీపంలో బంగాళాఖాతంలో నేవల్ షార్ట్ రేంజ్ యాంటీషిప్ క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించాయి. నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ నుంచి రెండు క్షిపణులను ప్రయోగించినట్లు నేవీ వర్గాలు తెలిపాయి.
ఈ ప్రయోగాన్ని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, నౌకాదళం, వాయుసేన అధికారులు పర్యవేక్షించారు. విజయవంతమైన పరీక్షపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బృందాలను అభినందించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!