

ఇరుముడితో రవితేజ కెరీర్‌లోనే భారీ బాక్సాఫీస్ రికార్డ్ నమోదైంది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్‌ను దాటింది. దీంతో రవితేజ కెరీర్‌లో రూ.150 కోట్ల మార్క్ అందుకున్న తొలి చిత్రంగా ఇరుముడి నిలిచింది. మొదటి వారం ముగిసే సమయానికి దాదాపు రూ.125 కోట్ల దగ్గర ఉన్న వసూళ్లు, 2వ వారంలోనూ జోరు కొనసాగించాయి. కొత్త సినిమాల రాకతో కొన్ని ప్రాంతాల్లో షోలు తగ్గినా, ప్రేక్షకుల ఆదరణ మాత్రం తగ్గలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నైజాంలో సినిమా బలమైన వసూళ్లు సాధించింది. అక్కడ రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు సమాచారం.
ఇరుముడికి ముందు రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ధమాకా నిలిచింది. ఆ చిత్రం దాదాపు రూ.82 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇరుముడి కేవలం 4వ రోజుకే ఆ మార్క్‌ను దాటేసింది. ఇప్పుడు రూ.150 కోట్లను కూడా అందుకోవడంతో రవితేజ మార్కెట్‌లో భారీ మార్పు కనిపిస్తోంది. 2వ వారంలోనూ కుటుంబ ప్రేక్షకుల ఆదరణ, వారాంతపు హౌస్‌ఫుల్ షోలు సినిమాకు బలం అయ్యాయి. ప్రస్తుతం రూ.200 కోట్ల మార్క్ వైపు ఈ సినిమా దూసుకుపోతుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!