

ఆంధ్రప్రదేశ్‌పై అర్నబ్ తుపాను ప్రభావం కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, సముద్రంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో సముద్రపు అలల ధాటికి తీరప్రాంతం కోతకు గురైంది. ఇటీవల ఎత్తుగా నిర్మించిన రాళ్లగట్టును సైతం అలలు దాటి తీరంపైకి దూసుకొస్తున్నాయి. దీంతో బీచ్ రోడ్డుపైకి రాళ్లు చేరి, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
మరోవైపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. కవిటి, కంచిలి, సోంపేట, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం, గార, లావేరు, ఆమదాలవలస ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. తీరప్రాంతాల్లో సముద్రపు అలల ఉద్ధృతి, వర్షాల నేపథ్యంలో స్థానిక పరిస్థితులను గమనించడం అవసరం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!