

యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టు డిపోర్టేషన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా కీలక తీర్పు వెలువరించింది. నైతిక దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే శాశ్వత నివాసితులు, గ్రీన్‌కార్డు హోల్డర్లను దేశం నుంచి బహిష్కరించే అధికారాలను ప్రభుత్వం వినియోగించవచ్చని స్పష్టం చేసింది. అలాగే ఇలాంటి కేసుల్లో ప్రవేశ ద్వారాల వద్దే అమెరికాలోకి ప్రవేశాన్ని నిరాకరించేందుకు కూడా ఈ తీర్పు అనుమతిస్తుంది. నకిలీ ట్రేడ్‌మార్క్ కేసులో చైనా జాతీయుడు మక్ చోయ్‌కు సంబంధించిన విచారణలో ఈ తీర్పు వెలువడింది.
ఇదే సమయంలో ఇరాన్ యుద్ధ అంశంలో ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. యునైటెడ్ స్టేట్స్ సెనెట్ పశ్చిమాసియాలో ఉన్న బలగాలను వెనక్కి తీసుకురావాలని, సైనిక చర్యలను నిలిపివేయాలని సూచిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం 50-48 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఈ పరిణామాలు అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాలు, విదేశాంగ నిర్ణయాలపై కొనసాగుతున్న చర్చలకు ప్రతిబింబంగా నిలుస్తున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!