

పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న పోలింగ్ సందర్భంగా ‘కమలం’ గుర్తుపై వివాదం చెలరేగింది. కొన్ని పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ యంత్రంలో కమలం గుర్తు కనిపించకుండా చేసి, ఓటర్లను ఓటేయకుండా అడ్డుకుంటున్నారని భాజపా ఆరోపించింది. డైమండ్ హార్బర్ పరిధిలోని ఫల్తా నియోజకవర్గంలో బటన్‌ను టేప్‌తో కప్పి ఉంచినట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.
ఈ ఘటనలకు సంబంధించి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, స్థానిక అధికారుల సహకారంతో ప్రత్యర్థి పార్టీ నేతలు ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభావిత బూత్‌లలో వెంటనే రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. పోలింగ్ బూత్‌లలో బటన్లపై జోక్యం జరిగిందన్న నివేదికలను పరిశీలిస్తున్నామని తెలిపింది. ఆరోపణలు నిజమని తేలితే, సంబంధిత బూత్‌లలో తిరిగి పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!