
జనరల్

రూ.1000 లంచం ఫిర్యాదుకు లక్ష రూపాయల బహుమతి అంటూ తమిళనాడు ప్రభుత్వం సరికొత్త నిర్ణయం ప్రకటించింది. సీఎం విజయ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏ ప్రభుత్వ శాఖలోనైనా లంచం డిమాండ్ చేసిన సందర్భంలో, ఆధారాలతో ఫిర్యాదు చేస్తే పౌరులకు ప్రభుత్వం తరఫున రూ.1 లక్ష నగదు బహుమతి ఇవ్వనుంది.
ఈ పథకం కోసం 24 గంటలు పనిచేసే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1555ను కూడా ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలను భాగస్వాములను చేస్తూ ఈ విధానం రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారి తీస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!