
ఓటీటీ

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ తన తొలి ప్రసంగంలో ప్రజలతో భావోద్వేగంగా మాట్లాడారు. తాను ప్రజల కుటుంబ సభ్యుడినని, అన్నగా, తమ్ముడిగా ఉంటానని ఆయన చెప్పారు. అబద్ధపు హామీలు ఇవ్వనని, సాధ్యమైన పనులనే చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పారదర్శక పాలన అందిస్తానని హామీ ఇచ్చారు.
తమ ప్రభుత్వంలో ఒక్కటే శక్తి కేంద్రం ఉంటుందని, అస్థిర పాలన ఉండదని విజయ్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. యువత ఆశలే తన బాధ్యత అని పేర్కొంటూ, తనను విమర్శించే వారిని కూడా శ్రేయోభిలాషులుగానే చూస్తానని వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!