

విశాఖపట్నం వేదికగా రేపు, ఎల్లుండి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖకు చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం అంతర్జాతీయ ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. సింగపూర్ మంత్రి హువాంగ్‌తో పాటు ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (WIPO) డైరెక్టర్ జనరల్‌తోనూ భేటీ కానున్నారు. అలాగే జపాన్ రాయబారి, యూఏఈ మంత్రితో కూడా ముఖ్యమంత్రి చర్చలు జరపనున్నారు.
మరోవైపు, రెన్యూ సంస్థ సీఈవో సుమంత్ సిన్హాతో చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం సీఐఐకి చెందిన వివిధ సంస్థల సీఈవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం రాత్రి 8 గంటలకు సదస్సుకు హాజరయ్యే అంతర్జాతీయ ప్రతినిధులకు ముఖ్యమంత్రి విందు ఇవ్వనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!