

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ సరిహద్దుల భద్రత కోసం బీఎస్‌ఎఫ్, ఆర్మీ, సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు, స్థానిక పరిపాలన యంత్రాంగం కలిసి చతుర్భుజ భద్రతా వ్యవస్థగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ నాలుగు విభాగాల సమన్వయం లేకుండా సురక్షితమైన సరిహద్దును ఊహించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. సరిహద్దులను కాపాడటం కేవలం భద్రతా దళాల బాధ్యతగా మాత్రమే ఉండకూడదని, ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని స్పష్టం చేశారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని బీకానేర్ జిల్లాలో సాంచూ వద్ద ఉన్న బీఎస్‌ఎఫ్ అవుట్‌పోస్టులో భద్రతా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడిన అమిత్ షా, సరిహద్దు ఆవల నుంచి వచ్చే ముప్పుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా, ఆవల నుంచి వచ్చే ఆదేశాలతో దేశంలో అంతర్గతంగా ఉద్భవించే ముప్పులపైనా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బాహ్య, అంతర్గత భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సమన్వయం, అప్రమత్తత అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!