

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై రాజకీయంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సీఈసీని పదవి నుంచి తొలగించడం సాధారణ పరిపాలనా ప్రక్రియ కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగా, ఏ కారణాలతో తొలగిస్తారో అదే తరహాలో సీఈసీని కూడా తొలగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జ్ఞానేశ్ కుమార్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగింపు ప్రక్రియకు రాజ్యాంగం నిర్దేశించిన విధంగా దుష్ప్రవర్తన లేదా అసమర్థత వంటి కారణాలు ఉండాలి. కేవలం రాజకీయ విభేదాలు లేదా విమర్శల ఆధారంగా సీఈసీని పదవి నుంచి తొలగించలేరు. ముందుగా పార్లమెంటులో తొలగింపు తీర్మానం ప్రక్రియ ప్రారంభమై, అనంతరం నిర్దేశిత విధానంలో ఆరోపణలపై విచారణ జరగాలి. రెండు సభల్లో రాజ్యాంగం నిర్దేశించిన ప్రత్యేక మెజార్టీ లభించిన తర్వాతే ప్రక్రియ తుది దశకు చేరుతుంది. అనంతరం రాష్ట్రపతి తొలగింపు ఉత్తర్వులు జారీ చేస్తారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!