
జనరల్

హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల విషయంలో బోంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గడువులోపు క్లెయిమ్ దాఖలు చేయకపోయినా, కేవలం ఆలస్యాన్ని కారణంగా చూపించి బీమా సంస్థలు క్లెయిమ్‌ను తిరస్కరించకూడదని స్పష్టం చేసింది. క్లెయిమ్‌కు అర్హత ఉంటే పాలసీదారులకు బీమా మొత్తం చెల్లించాల్సిందేనని కోర్టు పేర్కొంది.
ఇప్పటివరకు అనేక బీమా సంస్థలు నిర్ణీత గడువు దాటిందనే కారణంతో క్లెయిమ్‌లను తిరస్కరిస్తూ వచ్చాయి. అయితే ఐఆర్డీఏఐ మార్గదర్శకాల ప్రకారం కూడా కేవలం ఆలస్యాన్ని ఆధారంగా తీసుకుని క్లెయిమ్‌ను నిరాకరించడం సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుతో పాలసీదారులకు భారీ ఊరట లభించినట్లు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!