
జనరల్

హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేశ్ లడ్డూ ప్రసాదం వేలంలో ఈసారి రూ.39 లక్షల ధర పలికింది. వనస్థలిపురం సాహెబ్‌నగర్‌కు చెందిన అర్బన్ గ్రూప్ అధినేత సామ ప్రణీత్ రెడ్డి వేలం పాటలో లడ్డూను సొంతం చేసుకున్నారు. బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ప్రతి ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా, ఈసారి కూడా భారీ ధర పలకడం విశేషంగా మారింది.
గతేడాది బాలాపూర్ గణేశ్ లడ్డూ రూ.35 లక్షలకు వేలం జరిగింది. ఈ ఏడాదితో పోలిస్తే లడ్డూ ధర రూ.4 లక్షలు పెరిగింది. వేలం పాటలో స్థానికంగా పలువురు పాల్గొనగా, చివరకు సామ ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!