12, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శబరిమల యాత్రకు ప్రత్యేక రైళ్ల కోసం అయ్యప్ప భక్తుల విజ్ఞప్తి

Writer: Pooja 09:48 AM, 11 నవంబర్, 2026
శబరిమల యాత్రకు ప్రత్యేక రైళ్ల కోసం అయ్యప్ప భక్తుల విజ్ఞప్తి

కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లాల్లో అయ్యప్ప భక్తులు మాలధారణ చేసి శబరిమల యాత్రకు సిద్ధమవుతున్నారు. ఏటా ఈ ప్రాంతం నుంచి సుమారు 25 వేల నుంచి 30 వేల మంది వరకు అయ్యప్ప దీక్ష చేపట్టి కేరళలోని శబరిమల క్షేత్రానికి వెళ్తుంటారు. దూర ప్రాంతం కావడంతో చాలామంది రైలు ప్రయాణానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీక్ష చేపట్టిన భక్తులతో పాటు సాధారణ దుస్తుల్లో వెళ్లే యాత్రికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల మీదుగా శబరిమల యాత్రకు అనుకూలమైన మార్గాల్లో కేవలం మూడు రెగ్యులర్ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో జనవరి వరకు బెర్తులు ఖాళీగా లేవని భక్తులు చెబుతున్నారు. ఇప్పటివరకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించకపోవడంతో అదనపు రైళ్లు ఏర్పాటు చేయాలని అయ్యప్ప భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

గతేడాది నడిపించిన ప్రత్యేక రైళ్లను ఈసారి కూడా పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు. చర్లపల్లి–కొల్లం ఎక్స్‌ప్రెస్‌ (07113) ప్రతి మంగళవారం సాయంత్రం 6.53 గంటలకు ఆదోనికి చేరుకుని, తిరుగు ప్రయాణంలో గురువారం అదే మార్గంలో వెళ్లేది. భక్తుల విజ్ఞప్తి మేరకు గతేడాది నడిపించిన మచిలీపట్నం–కొల్లం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ (07103) రాత్రి 8.35 గంటలకు నంద్యాలకు చేరుకుని, మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొల్లం వెళ్లేది. భక్తులు చెంగన్నూరులో దిగి అక్కడి నుంచి మరో 84 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో శబరిమలకు చేరుకునేవారు. నాందేడ్‌–కొల్లం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ (07111) కూడా గతేడాది డిసెంబరు, జనవరి నెలల్లో ప్రతి గురువారం కర్నూలుకు రాత్రి 8.25 గంటలకు, డోన్‌కు 10.15 గంటలకు చేరుకునేలా నడిపించారు. ప్రస్తుతం పుణె–కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌ (16381), కాచిగూడ–మంగళూరు/మురుడేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12789), కాచిగూడ–కుంటకల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12790) మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్లు కూడా నిర్దిష్ట రోజులు, సమయాల్లోనే నడుస్తుండటంతో యాత్రికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

ట్యాగ్లు
అయ్యప్ప భక్తులుశబరిమల యాత్రప్రత్యేక రైళ్లుకార్తీక మాసంరైల్వే సేవలుకేరళ ఆలయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
జనరల్

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!