
సినిమాలు

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కల్పించే రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మేయర్ ఎన్నికల్లో బీసీలకు 35.29 శాతం, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో 33.02 శాతం, పట్టణ వార్డుల్లో 32.78 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపింది. గ్రామ పంచాయతీ వార్డుల్లో 26.73 శాతం, సర్పంచ్ పదవుల్లో 27.95 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు పేర్కొంది.
ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 24.6 శాతం రిజర్వేషన్లు ఉండనున్నాయి. జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో 23.08 శాతం సీట్లు కేటాయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా వెలువడే అవకాశం ఉందని సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!