

బాలీవుడ్ నటి అనుష్క శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి వార్తల్లో నిలిచారు. ముంబైలో ప్రముఖ భక్తి గాయకుడు కృష్ణ దాస్ నిర్వహించిన కీర్తన కార్యక్రమంలో ఈ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుష్క శర్మ భక్తి పారవశ్యంలో మునిగిపోయి ‘రాధే గోవిందా’ నామాన్ని జపిస్తూ కీర్తనలను ఆస్వాదించారు. మొదటి వరుసలో కూర్చుని చప్పట్లు కొడుతూ భక్తితో గడిపారు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా ప్రశాంతంగా భజనలను ఆస్వాదిస్తూ కనిపించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ కార్యక్రమంలో అనుష్క శర్మ ధరించిన సాధారణ దుస్తులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెజెంటా రంగులోని అనార్కలీ సూట్‌లో ఆమె సంప్రదాయబద్ధంగా, సింపుల్‌గా కనిపించారు. ‘ప్లేస్ ది డాట్’ బ్రాండ్‌కు చెందిన ‘ఘూమర్ అనార్కలీ మల్బరీ సెట్’గా పేర్కొంటున్న ఈ దుస్తుల ధర సుమారు రూ.10,900గా ఉన్నట్లు సమాచారం. మ్యాచింగ్ దుపట్టా, తేలికపాటి మేకప్, వదులుగా వదిలిన జుట్టు, చిన్న బొట్టుతో అనుష్క ఆకట్టుకున్నారు. ఆడంబరాలకు దూరంగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఈ జంటను అభిమానులు ప్రశంసిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!