

అమరావతి రాజధాని నగర నిర్మాణం వేగవంతం కావడం స్వాగతించదగ్గ పరిణామమే అయినప్పటికీ, అది జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT) తీర్పు మరియు కేంద్ర పర్యావరణ శాఖ మంజూరు చేసిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ (EC) నిబంధనలకు పూర్తిగా లోబడి జరగాలని పర్యావరణవేత్త, అమరావతి కేసులో మాజీ పిటిషనర్ బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. పర్యావరణ చట్టాలను పాటించడం కేవలం ఒక విధానపరమైన అంశం కాదని, రాజధాని నిర్మాణానికి చట్టపరమైన రక్షణ కల్పించే కీలక బాధ్యత అని ఆయన అన్నారు.
పర్యావరణ నిబంధనలను విస్మరిస్తే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు, వరదల వంటి పర్యావరణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులు పర్యావరణ అనుమతుల ఉత్తర్వులను అక్షరాలా అమలు చేస్తూ అమరావతి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. రాజధాని అభివృద్ధి తరతరాలకు నిలిచే విధంగా, పర్యావరణ హితంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!